భారతీయ కస్టమర్లలో భద్రతకు ప్రసిద్ధి చెందిన స్కోడా.. గత నెల మే 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. గత నెలలో స్కోడా స్లావియా అమ్మకాలలో అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,538 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాది 2023 మేలో స్కోడా స్లావియా మొత్తం 1,695 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.