భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ సంచలనాలు సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్స్‌ను సాధించి రికార్డు బద్ధలు గొట్టింది. గతంలో ఈ కారు బేస్ వేరియంట్ కోసం కస్టమర్ల నుంచి అత్యధిక బుకింగ్స్ రావడంతో కంపెనీ వెంటనే బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కస్టమర్లకు శుభవార్త…