స్నేహితుని ఆస్తి దక్కించుకోవాలనే దురాశతో అతని కుటుంబాన్ని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూరులో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన మేడిద ప్రశాంత్, రాచర్ల పూన ప్రసాద్ స్నేహితులు. ప్రశాంత్ తన అవసరాల కోసం ప్రసాద్ వద్ద రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాతి కాలంలో ప్రసాద్ ఓ కేసులో ఇరుక్కోగా.. అతను కేసు…