ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభాకర్ రావును విచారించింది. 14 రోజుల కస్టడీ విచారణ నిన్నటితో ముగియగా.. ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ను కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ విచారణ పూర్తయిన తర్వాత సిట్…