ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన…