‘శంకరాభరణం’ తరువాతే దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ ను అందరూ ‘కళాతపస్వి’ అంటున్నారు. అంతకు ముందు ఆయన తెరకెక్కించిన చిత్రాలను గమనించినా, వాటిలో సంగీతసాహిత్యాలకు, కళకు విశ్వనాథులవారు ఇచ్చిన ప్రాధాన్యం కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన హాస్యప్రధాన చిత్రంలో సైతం సాహితీవిలువలు ప్రస్ఫుటంగా కనినిస్తూ ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘సిరిసిరిమువ్వ’ తెలుగువారిని విశేషంగా అలరించింది. 1976 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తరువాత వచ్చిన సూపర్ స్టార్ మూవీస్ సినిమాల నడుమ సైతం…