ఆవిడ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో మూడు పాటలు పాడారు. పాడిన ఆ మూడూ ఈ రోజుకీ సంగీత ప్రియుల నోట వినవస్తూనే ఉన్నాయి. 1971లో ఎన్టీయార్, వాణిశ్రీ జంటగా నటించిన సినిమా ‘జీవిత చక్రం’. ఈ మూవీలో ‘కంటిచూపు చెబుతోంది… కొంటెనవ్వు చెబుతోంది’ పాటతో పాటు ‘కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు…’ పాటనూ, ‘మధురాతి మధురం… మన ప్రేమ మధురం’ గీతాన్ని ఘంటసాలతో కలిసి పాడారు శారదా రాజన్. ఈ సినిమా తర్వాత మరే తెలుగు…