రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తోన్న ఆయన.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సమావేశం అయ్యారు.. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చర్చించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది.. ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా.. పలు సంస్థల అధిపతులతో సమావేశంకానున్నారు.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించబోతున్నారు..
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటనకు బయలుదేరనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ లతో కూడిన 8 మంది బృందం సింగపూర్ లో పర్యటించించనున్నారు.. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించి.. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేబినెట్ సమావేశంలో సింగపూర్ టూర్‌పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
Cargo Ship: కేరళలోని కన్నూర్ జిల్లాలోని అళిక్కల్ నుండి 44 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ కార్గో షిప్‌లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో పాటు భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
Covid-19: కొన్నాళ్లుగా సద్దుమణిగి ఉన్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లో వేల సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా అంతటా కొత్త కోవిడ్-19 వేవ్ వ్యాపిస్తోంది. కే
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని రివర్ వాలీ రోడ్‌లో రోడ్ షాప్ హౌస్ అనే మూడు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్‌కి గాయాలయ్యాయి. రెండవ అంతస్తులోని టమాటో అనే స్కూల్‌లో ఈస్టర్ క్యాంప్‌లో ఉన్నాడు శంకర్. కొద్ది రోజుల కుకింగ్ కోర్సు కోసం శంకర్‌ను అక్కడ పవన్ సతీమణి చేర్చారు. అదే ఫ్లోర్‌లో చెలరేగిన మంటల కారణంగా శంకర్‌తో పాటు 15 మంది…
మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు.. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు అయ్యాయి.. సింగపూర్లో స్కూల్‌లో మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో.. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి..