ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసిన క్రమంలో తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించాలని నిర్ణయించింది.
ప్రయాణంలో ఆసౌకర్యం కలిగినందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. పరిహారంగా రూ.2 లక్షలు తిరిగి అందుకున్నారు. హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను డీజీపీ రవి గుప్తాకి పరిహారంగా ₹2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, ఆయన భార్య అంజలి గుప్తా మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. బిజినెస్ (జెడ్) క్లాస్‌లోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్…
Singapore Airlines: ఎయిరిండియా సేవలు భవిష్యత్తులో ఇండియా మొత్తం విస్తరించనున్నాయి. దేశంలోని కీలకమైన ఎయిర్‌లైన్ సెగ్మెంట్లన్నింటిలోనూ తన ఉనికిని చాటుకోనుంది. ఎయిరిండియాలోకి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విలీనం అనంతరం ఇది వాస్తవ రూపం దాల్చనుంది. ఫలితంగా మల్టీ హబ్ స్ట్రాటజీ అమల్లోకి వస్తుంది. తద్వారా.. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ అతిపెద్ద విమానయాన రంగంలో తనదైన గత వైభవాన్ని ఘనంగా చాటుకోనుంది.
Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్‌బస్‌తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది. అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్‌ఫుల్ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ధీటుగా ఢీకొట్టబోతోంది.
Air india-Vistara: విస్తార ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనం కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ రీసెంట్‌గా ప్రకటించింది. విస్తారలో టాటా గ్రూప్‌కి మెజారిటీ షేరు.. అంటే.. 51 శాతం వాటా ఉండగా మిగతా 49 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. ఇదిలాఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాలో 25 పాయింట్ 1 శాతం షేరును దక్కించుకునేందుకు 2 వేల 58 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
Fighter jets escort Air plane: సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్లైట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ప్రయాణికులు బాంబు బెదిరింపులకు పాల్పడటంతో విమానాన్ని అత్యవరంగా ల్యాండ్ చేశారు. బుధవారం రోజున చాంగిలోని సిటీ స్టేట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపుల కారణంగా రెండు ఫైటర్ జెట్లు విమానం అత్యవసరం ల్యాండ్ అయ్యేలా ఎస్టార్క్ ఇచ్చాయి.