ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’.…