సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో గోల్ మాల్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. 748ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2016లో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… రామచంద్ర మోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు భావిస్తుంది. ఈఓ కు అధికారం లేకపోయినా రికార్డుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.…