తెలంగాణలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ ఎపిసోడ్ నలుగుతున్న వేళ ప్రోటోకాల్ వివాదం పై మాట్లాడటానికి ఇష్టపడలేదు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంట్లు సంతోషాన్ని కలిగించాయి. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో గవర్నర్ మీడియాతో ముచ్చటించారు. తాజా వివాదంపై ఆమె మాట్లాడడానికి అయిష్టత చూపించారు. భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి…