Sikkim Flood: సిక్కింలో మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నదిలో అకస్మాత్తుగా వరదలు రావడంతో మరణాల పరంపర కొనసాగుతోంది. మట్టి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పరిస్థితి నెలకొంది.
Sikkim Flash Flood: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. 82 మంది గల్లంతయ్యారు. మొత్తం 14 వంతెనలు దెబ్బతిన్నాయని, 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఒకర్ని సురక్షితంగా రక్షించగా.. మిగిలిన 22 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.