సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు..
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫేజ్-3 లోని సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంఘటన స్థలాన్ని సందర్శించనుంది. NDMA బృందం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SDMA) తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్ లేదా…
Sigachi Company: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సిగాచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమృత్ రాజ్ సింహ స్పందించారు. ఈ ఘటనపై కంపెనీ మేనేజ్మెంట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 38 మంది కార్మికులు మృతి చెందగా, 33 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 90 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గాయపడినవారికి…