Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటి విడుదల జరుగుతుండగా, విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సాత్నాల, మత్తడి వాగు…