రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.