బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా ట్రెండ్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జాన్వీ ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అయితే ఒక సందర్భంలో ఆమె ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా, సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఈ సందర్భంలో ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు.…