Congress : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు.
కర్ణాటకలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
BJP MLAs Slept Inside Assembly: కర్ణాటక రాజకీయాల్లో బుధవారం ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే నిద్రించారు.
ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేయగానే.. ఆయా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది
Karanataka : ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం 48 గంటల్లో యూ టర్న్ తీసుకుంది. ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసింది.
Karnataka : ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ పోస్టులకు 100శాతం కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని..…
పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్ లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఇద్దరికి ఊరట లభించింది.