Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు…