కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా కెప్టెన్ డాక్టర్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన గీతికా కౌల్ రికార్డులకెక్కారు. అక్కడ యుద్ధ పాఠశాలలో కౌల్ కఠినమైన ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది.
పెట్రోలింగ్‌లో ఉండగా హిమపాతంలో తప్పిపోయిన ఆర్మీ జవాన్ మృతదేహం 38 ఏళ్ల తర్వాత సియాచిన్‌లోని పాత బంకర్‌లో లభ్యమైంది. ఆదివారం రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్ మృతదేహాన్ని 19 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా గుర్తించారు.