స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారనుకున్నా.. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు…