Taali Trailer: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ తరువాత సుస్మితా ఒక స్ట్రాంగ్ కథతో వస్తుంది. ఇది కథ అనడం కన్నా బయోపిక్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే మొట్ట మొదటి ఎలక్షన్ అంబాసిడర్ అయిన శ్రీగౌరీ సావంత్ జీవిత కథగా తెరకెక్కిన సిరీస్ తాలి.