సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద…