కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం చల్లారడం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి కర్ణాటకలో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే, కర్ణాటకలోని శివమొగ్గ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న కొందరు ముస్లీం యువతులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. హాజాబ్‌ను తీసివేసి స్కూల్ లోపలికి వెళ్లానని కోరారు. ఉపాధ్యాయుల విన్నపాన్ని యువతులు అంగీకరించలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు.…