కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది.…