బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యాపారవేత్త దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా దంపతులపై జుహు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. సమాచారం ప్రకారం, నిధుల మళ్లింపు లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరు శిల్పా-రాజ్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో…
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలకు ₹60 కోట్ల మోసం కేసులో బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలిస్తూ తిరస్కరించింది. ప్రయాణం చేయాలంటే ముందుగా ఆరోపణలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని, అంటే ₹60 కోట్లను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారిపై జారీ అయిన లుకౌట్ సర్క్యులర్ (LOC)పై స్టే ఇచ్చేందుకు కూడా…