దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 15 వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగంగా నిర్వహించుకుంటుంటే, మేఘాలయ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అలజడులు జరిగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనలు జరిగాయి. నేషనల్ లిబరేషనల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. ఇటీవలే లైతుంఖ్రా వద్ద జరిగిన బాంబు దాడుల్లో థాంగ్‌కీ హస్తం ఉందనే అనుమానాలు కలగడంతో ఆయన్న…