దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది. దీంతో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.