బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు,…