బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.
షేక్ హసీనా.. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన మహా నేత. ఎంతో ఘనకీర్తిని సంపాదించింది. కానీ ఒక్క రోజులోనే చరిత్ర తల్లకిందులైంది. ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పి విదేశాలకు పారిపోయింది.