Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి.