టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే.. జట్టు కోసం బ్యాటింగ్ చేసిన శార్దూల్‌ను మ్యాచ్ అనంతరం ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ లక్నోలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. శార్దూల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. 2024 ఇరానీ కప్ టోర్నీలో శార్దూల్ ముంబై జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇరానీ కప్ పోరులో ముంబై, రెస్టాఫ్ ఇండియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ…