కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు.