మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు.
శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎన్‌సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది.