TSPSC Chairman: ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి..చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమక్షంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్థన్ రెడ్డి పనిచేశారు. ఇటీవల జనార్థన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం… అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. చైర్మన్, సభ్యుల పదవులకు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్లతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. సభ్యత్వం కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి ముగ్గురి పేర్లను ప్రభుత్వం పరిశీలించగా.. వీరిలో తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పేరు ఖరారు చేసి రాజ్ భవన్ కు పంపించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ పరిశీలించి.. మహేందర్ రెడ్డి పేరును ఆమోదించారు.
Read also: RAM Movie Review: రామ్- రాపిడ్ యాక్షన్ మిషన్ రివ్యూ
ఇక మహేందర్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందినవారు. ప్రాథమిక విద్యను నల్గొండ జిల్లా సర్వేల్ గురుకులంలో పూర్తి చేశారు. వరంగల్ ఎన్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 17 నవంబర్ 2017 నుండి 31 డిసెంబర్ 2022 వరకు పనిచేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు.