Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్‌ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.