Sonu Sood: యాక్టర్ సోనూ సూద్ దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. కస్టమర్ రొట్టేలపై ఉమ్మేస్తున్న యువకుడికి మద్దతు తెలిపినందుకు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను సోనూసూద్ ‘‘రాముడికి ఎంగిలి చేసిన పండ్లను తినిపించిన శబరి’’తో పోల్చడం మరింత వివాదాస్పదమైంది. ఈ వివాదం మొత్తం ‘‘కన్వర్ యాత్ర’’ రూల్స్‌తో మొదలైంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అధికారుల కన్వర్ యాత్ర మార్గాల్లోని ప్రతీ దుకాణదారుడు తన పేరు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.…