జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇప్పుడు కేంద్రం మరో ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇటీవల…