ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్‌ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్‌లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.