లోక్‌సభలో వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ 2024పై చర్చ నడుస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈరోజు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు.