భారత సైన్యంలో అధికారుల కొరతను తీర్చేందుకు కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులు (ఎస్‌ఎస్‌బీ) తెరవనున్నారు. భారత సైన్యం దీనిపై కసరత్తు చేస్తోంది ఈ ఏడాది చివరి నాటికి 3 కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం 12 బోర్డులు ఉన్నాయి, అది కాస్తా త్వరలో 15 అవుతుంది.