దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. అయితే ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు ప్రకటించారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్ -2 పరీక్షలో సర్వర్ సమస్య తలెత్తింది. సాయంత్రం 4 గంటలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు.…