Blood Moon: సెప్టెంబర్ 7వ తేదీ ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన ఆకాశాన్ని అలరించబోతోంది. అదే ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, రాగి రంగులలో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. భారత్‌లో కూడా ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై,…