మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు.…