మేషం : గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వృషభం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరచూ పర్యటనలు,…