ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ…