ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్న అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్, మంత్రి రోజాపై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే.. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ అనుచరుల…