తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్‌కు విశేషమైన సేవలందించిన సీనియర్ నిర్మాత మహేంద్ర (ఏ.ఏ ఆర్ట్స్ అధినేత) జూన్ 11 (బుధవారం) అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర , చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి లోకాన్ని విడిచారు. గురువారం (జూన్ 12) నాడు ఆయన స్వస్థలమైన గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. ఈ వార్త తెలుగుతెరకు షాక్ కలిగించింది.…