హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు.…