రక్తంలో చెక్కర స్థాయిలు పెరగడం కారణంగా డయాబెటిస్ కు గురవుతుంటారు. ఇన్సులిన్ లోపం కారణంగా ఇది సంభవిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్స్ కు తీపి కబురు అందింది. భారత్ లో ఓజెంపిక్ ఔషధం వాడకానికి ఆమోదం లభించింది. భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (CDSCO), టైప్ 2 డయాబెటిస్ ఉన్న వయోజన రోగులకు ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్)ను ఆమోదించింది. Also Read:Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ…
చాలా మంది బరువు తగ్గడానికి సులభమైన మార్గాల కోసం వెతుకుతారు. అందుకే.. వివిధ కంపెనీలు సప్లిమెంట్లు, కొవ్వు తగ్గించే మాత్రలు, పౌడర్లు, ఇంజెక్షన్లు వంటి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటాయి. చాలా మంది ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటిదే మరో ఇంజెక్షన్ భారత్‌లో విడుదలైంది. జూన్ 24న, డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ బరువు తగ్గించే మందును విడుదల చేసింది. ఈ ఔషధం పేరు వెగోవీ (సెమాగ్లుటైడ్). ఇది ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది.
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్…